ABOUT ME

"ఈ క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో
ఈ నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో "
అనితలుస్తూ వాస్తవంలో బతుకుతూ భావుకతని ఆరాధిస్తూ తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే సామాన్యుడిని నేను..



కవితలు చెప్పే హృదయం వుంది !
ప్రేమించే మనసు వుంది
మనసులొన మంచి ఉహ వుంది
ఉహల లొకం లొ ఒక ఆశ వుంది
కలసి వుండే కోమలి యెక్కడ వుందొ?

చెప్పాలి అంటే చాలా వుంది వినే ఓపిక వుందా.....




మనకు ఎందరో పరిచయం అవుతుంటారు
అందులో కొందరే మంచి స్నేహితులవుతారు
మనతో మంచి చెడు పంచుకుంటూ
మంచి స్నేహితులు దొరకడం ఒక అదృష్టం కూడా

1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే పారిపోయేవారు అనామకులు గానే మిగిలిపోతారు"...

2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...

3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది. నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...

4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End..'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...

5."నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వారికీ నచ్చలేదన్నమాట"...

6."ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి"...

7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు....!


నేను, ప్రపంచం అనే మహా సముద్రంలో నీటి బిందువుని,
ఎడారిలోని ఇసుక రేణువుని, తీరం తాకని అలని,
గడుస్తున్న కాలంలో నడుస్తున్న గడియారాన్ని, బాష లేని భావాన్ని..
స్నేహం, నమ్మకం, ఆశలకు అభిమానిని..
అన్నీ నేనే అనేటంత గొప్పదాన్ని కాదు..
అందరిలో ఒకరిగా ఉండే మామూలు మనిషిని
.........