Tuesday, January 12, 2010

Jagan Goud



నన్ను
అర్ధం చేసుకోడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం
దగ్గరైతే చాలా స్వీట్‌గా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్
చెప్పిన మాటలు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా చేతనైనంత సాయం చేసి ఇంకో నాలుగురికి ఆదర్శంగా నిలవాలన్నది నా ఆశ. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటా! గంట సీరియస్‌గా ఉంటే జీవితంలో ఒక గంట ఎందుకు పనికి రాకుండా పోయిందని అనుకుంట.ఎప్పుడూ సీరియస్‌గా కనిపించేవాళ్లను చూస్తే నాకు చిరాకు! వాళ్ళను దూరంగా ఉంచుతా.పక్కా ప్రాక్టీకల్. చుట్టూ జనం ఉండాలి నాకెప్పుడూ...ఒంటరితనం భరించలేను!

నీకు కోపం కొంచం ఎక్కువ అంటారండి
మా ఫ్రెండ్స్.కాని వెంటనే పోతుంది అని కూడా వాళ్లే అంటారు... ఏమిటో ?? నాకు
తెలీని విషయం నాకన్నా ఎంత చిన్నవాళ్లు చెప్పినా వింటాను.నాలో నాకు నచ్చనిది కోపం ఒకటే.

ఇంకా ఏమన్నా మర్చిపోతే చెప్పండి రాసుకుంటా!!!



నన్ను నేను మెచ్చుకుంటాను
లోకం నాకు నచ్చనప్పుడు...                       
నన్ను నేను అద్దంలో చూచుకుంటాను
నా కోణంలో వేరెవరు ఆలోచించనప్పుడు,
నాకు నేనే మౌనం వహిస్తాను
నా పలుకులు ఇతరులను బాదిన్చినపుడు..
నాకు నేను శిక్ష విధించుకుంటాను
నేరం నావలన జరిగినప్పుడు..
నా మనసును నేను లేక్కచేయ్యను
అది తప్పు అని నాకు తోచినప్పుడు

గగాన జగములో యుగాలు మారిన .. ఆగాదు నా ఆలోచనా......
ఆకాశము లో మెరిసే మెరుపు ..శబ్దం తో వచ్చే పిడుగుల కన్నా ...
నా ఆలోచనలతో వచ్చే ఆ పదం గొప్పది ......
జగన్ గౌడ్